నాచకరీ క్షేత్ర హుండీ లెక్కింపు..
రూ. 11.83 లక్షల ఆదాయం
NEWS Sep 24,2024 01:46 pm
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఈరోజు చేపట్టినట్లు ఆలయ ఈవో ఎస్. అన్నపూర్ణ వివరించారు. 75 రోజులకు గాను హుండీ లెక్కింపు చేపట్టగా రూ. 11,83,932 ఆదాయం సమకూరినట్లు వివరించారు. హుండీ లెక్కింపులో ఉమ్మడి మెదక్ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది సుధాకర్, పాండు, నరేందర్, నరసింహులు, భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు