వరద బాధితులను ఆదుకోవాలి
NEWS Sep 24,2024 01:37 pm
తీవ్ర వరద నష్టం వల్ల కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో జగనన్న కాలనీలో 15 రోజులు పైగా వరద నీటిలో బాధితులుగా ఉన్న కాలనీ వాసులకు వీధీ లైట్లు, మంచినీరు, రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , వరద నష్ట పరిహారం బాధితులను నమోదు చేయాలని, ఆధార్ కార్డు మ్యాప్ అవ్వలేదని కొంతమందికి పరిహారం చెల్లించటం లేదని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోకీ జగనన్న కాలనీని కలపి మౌళిక సదుపాయాల కల్పించాలని డిమాండ్ చేశారు.