పవన్ దీక్షకు మద్దతుగా శాంతి పూజ
NEWS Sep 24,2024 01:32 pm
కలియుగ ప్రత్యకదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృతతుల్యమైన దివ్యప్రసాదం తిరుమల తిరుపతి లడ్డూ పవిత్రత పునరుద్ధరణకు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మైలవరం ఎంఎల్ఏ వసంత వెంకట కృష్ణప్రసాదు సంఘీబావం తెలిపారు. శాంతి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం ఇన్చార్జి అక్కల గాంధీ, ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, జంపాల సీతారామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.