కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చెన్నమనేని వికాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ దేశంలో సభ్యత్వ నమోదు కోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని చేస్తున్నారని, ఒక బూతులో 50 మంది సభ్యులను సభ్యత్వ నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, బీజేవైఎం జిల్లా నాయకులు మారుతి, కాసోజు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.