అక్రమ కేసులు నమోదు చేశారని గ్రామస్తుల ఆందోళన
NEWS Sep 24,2024 01:49 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో అటవీ శాఖ భూమిలో చెట్లను కొట్టివేశారని గ్రామానికి చెందిన ఆరుగురు పై అక్రమంగా కేసు పెట్టారని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు, గ్రామాన్ని అనుకొని ఉన్న అటవీశాఖ భూమిలో కొందరు చెట్లను కొడుతున్నారని అటవీ శాఖ అధికారులు గ్రామంలోని పలువురి పై కేసు నమోదు చేయగా ఆ కేసులు అక్రమమని వెంటనే కేసులు ఎత్తివెయ్యాలని గ్రామస్తులు సమావేశం నిర్వహించి రోడ్డుపై నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఉమామహేశ్వరరావు వారిని శాంతింపజేశారు.