రుణమాఫీ రాని రైతుల పరిస్థితి ఏమిటి: ఎమ్మెల్యే
NEWS Sep 24,2024 01:52 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో 9,500 మంది రైతులకు గాను సుమారు కేవలం 3000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా రైతుల సంగతి ఏంటని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం మల్లాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగదీష్, ఎమ్మార్వో వీర్ సింగ్, పంచాయతీరాజ్ డిఈ, అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.