కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానాలి
NEWS Sep 24,2024 01:55 pm
కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మాని జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నారాయణ, కోహిర్ మండల అధ్యక్షుడు నర్సింలు అన్నారు. జహీరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.