తాత్కాల్ ద్వారా ఓపెన్ ఫీజు చెల్లించవచ్చు
NEWS Sep 24,2024 01:57 pm
అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి ప్రతి సబ్జెక్టుకు 100 తో పాటు అదనంగా 500 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఇంటర్ కు ప్రతి సబ్జెక్టుకు 150 రూపాయలతో పాటు 1000 రూపాయలు అదనంగా తాత్కలిక కింద ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.