లడ్డు కల్తీ చేసిన దోషులను శిక్షించాలి
NEWS Sep 24,2024 02:07 pm
వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ కొవ్వు పదార్ధాలతో తయారు చేయించడం బాధాకరమని హిందూ నాయకులు, కాపు సంక్షేమ సేన జిల్లా కార్యదర్శి కనకాల వెంకటేశ్వరరావు (దొరబాబు) ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తిరుపతిలో అపచారం చోటు చేసుకుంది అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తిరుమల అపవిత్రం అయిన సందర్భంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని అన్నారు. లడ్డు అపవిత్రం కావడానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.