కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు
26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్
NEWS Sep 24,2024 03:21 pm
కాంట్రాక్టు కార్మికులకు నెలకు 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కంది బస్టాండ్ వద్ద మంగళవారం నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంటాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీక్షలో జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు పాల్గొన్నారు.