ఎల్ఈడి లైట్ల తయారీపై విద్యార్థులకు శిక్షణ
NEWS Sep 24,2024 03:25 pm
నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని జిల్లా సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు ఎల్ఈడీ ట్యూబ్ లైట్ల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని ఎంపిక చేసిన 50 పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని ఎల్ఈడీ లైట్ల తయారి నేర్చుకున్నారు. ఎన్జీసి రాష్ట్ర సమన్వయకర్త రాజశేఖర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త మాధవరెడ్డి పాల్గొన్నారు.