సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి: నల్లా పవన్
NEWS Sep 24,2024 08:40 am
జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు విళ్ళ దొరబాబు అధ్యక్షతన అమలాపురం పార్లమెంట్ బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కిసాన్ మోర్చా పదాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.