రైతువేదిక భవనానికి రైతుల తాళం
NEWS Sep 24,2024 07:37 am
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా డిసెంబర్ నెలలొనే రెండు లక్షల ఋణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రుణమాఫీ చెయ్యలేదని,వెంటనే రైతులకు రుణమాఫీ రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు, అనంతరం రైతువేదిక ముందు బైటాయించి నిరసన తెలిపారు.అనంతరం మండల వ్యవసాయ అధికారి కి,తహాశీల్ధార్ కు వినతి సమర్పించారు.