జగిత్యాల పట్టణంలో చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద రజక సంఘ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.