యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని టెస్టుల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. యాదాద్రి ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పులిహోర నాణ్యతను పరీక్షిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా అధికారులు లడ్డూ తయారీపై నిర్ణయం తీసుకుంటారు.