రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించే విషయంపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.