ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్
NEWS Sep 24,2024 05:54 am
18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకున్నందుకు అర్హులని పేర్కొన్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో పోలింగ్ బూత్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.