టాయిలెట్లను శుభ్రపరిచిన ఆటో డ్రైవర్లు
NEWS Sep 24,2024 05:52 am
స్వచ్ఛతా హి సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి సూచన మేరకు కోరుట్ల ఆటో డ్రైవర్స్ యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు సోమవారం పబ్లిక్ టాయిలెట్లను, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి కోరుట్ల పట్టణానికి వచ్చే ప్రజలు పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకుని, కోరుట్ల పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా మార్చడం కొరకు సహకరించాలని కోరారు.