హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
NEWS Sep 24,2024 05:53 am
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.