కోరుట్ల పట్టణంలో నకిలీ 500 రూపాయలు నోటు కలకలం రేపింది. ఆర్డిఓ ఆఫీస్ పక్కన రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న సంజు మెస్ వద్ద సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి 5 రొట్టెలు తీసుకోగా ఫోన్ పే చేస్తా డబ్బులు అని చెప్పి ఫోన్ పే వెళ్లడం లేదు అని 500 నోటు ఇవ్వగా చేసేది ఏమీ లేక 5 వందల తీసుకొని మిగిలిన డబ్బులు తిరిగి ఇచ్చేశారు. తర్వాత హోటల్లో కర్రీ అయిపోగా పన్నీర్ కోసం తన కొడుకుని పంపగా ఇది నకిలీ నోటు అని తేలడంతో లబోదిబోమంటూ బాధ పడ్డారు