గణపయ్య లడ్డు దక్కించుకున్న
ముస్లిం యువకుడు
NEWS Sep 24,2024 04:50 am
17 రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లిం యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్ లో ప్రతిష్ఠంచిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం సందర్భంగా సోమవారం వేలం వేశారు. లడ్డూను దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ సాగగా, చివరకు మక్బూల్ అనే యువకుడు రూ. 36,616 వేలకు సొంతం చేసుకున్నాడు. మరో లడ్డూను రూ. 7 వేలకు పోల జనార్దన్ దక్కించుకున్నాడు.