అక్షయపాత్రలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కందిలోని కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. అక్షయపాత్రలో విధులకు హాజరవుతూ జూలై 25వ తేదీన ముగ్గురు మృతి చెందిన సంఘటన తెలిసిందే. వీరి కుటుంబాలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. అక్షయపాత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.