44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
NEWS Sep 24,2024 06:22 am
రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి అయ్యప్ప దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బొలెరో వాహనం ఢీకొట్టడంతో కారు రోడ్డు కిందికి దూసుకుపోయి బోల్తా పడింది, బొలెరో వాహనంలో డ్రైవర్ ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను 2 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.