జోగిపేటకు శౌర్య యాత్ర..
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
NEWS Sep 24,2024 06:24 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి రాష్ట్ర శౌర్య యాత్ర వస్తుందని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగ భూషణం తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ సాయుధ పోరాట వీధి నాటిక, కళాకారుల బృందం కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.