జిల్లాలో ముగ్గురు అదృశ్యం
NEWS Sep 24,2024 06:29 am
సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు అదృశ్యమయ్యారు.సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన మచ్కురి శేఖర్(32) మద్యం మానేయడంతో పిచ్చి చేష్టలతో అదృశ్యం అవ్వగా, జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో కోహీర్ మండలంలోని సజ్జాపూర్ కు చెందిన లక్ష్మి 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో నివాసం ఉండే ప్రశాంత్ 14వ తేదీన డ్రైవింగ్ పని మీద రెండు రోజులు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు.తిరిగి ఇంటికి ఇంటికి రాలేరు. వారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు చేశారు.