గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వారి కథనం మేరకు..బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో ఇద్దరు మహిళలు ఎండు గంజాయిని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి ఇద్దరు మహిళల వద్ద 9.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాం.ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.