సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఒక గేటును పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ భాగంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యామ్ లోకి వరద నీరు చేరుతోంది.దీంతో 11వ నంబర్ గేటు ఎత్తి దిగువకు 11వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే.. 2 టర్బయిన్ ద్వారా 0.5ఎం యూల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.