రుణాల మంజూరులో జాప్యం సరికాదు
NEWS Sep 24,2024 05:56 am
రుణమాఫీ జరిగిన రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని, రుణాల మంజూరులో జాప్యం చేయడం సరికాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రుణమాఫీలో లబ్ధి పొందిన రైతులందరికీ కొత్త రుణాలు మంజూరులో బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే రైతులకు రుణాలు అందజేయాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులు ఆదేశించారు.