వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
NEWS Sep 24,2024 05:57 am
మెదక్ పట్టణంలోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల సూపరిండెంట్ కు తగు సూచనలు చేస్తూ వైద్య కళాశాల మౌలిక సదుపాయాలను, 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక, చేసుకోవాలని కళాశాలకు సంబంధించిన పనులలో వేగం పెంచి నిర్దేశ గడువు తేదీలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.