బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
NEWS Sep 23,2024 07:08 pm
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన వంగల మహిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మల్యాల అంగడి బజార్ లోని కిరాణా వర్తక వ్యాపారులతో కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద రెడ్డి, దారం అదిరెడ్డి, లక్ష్మారెడ్డి, మ్యాక లక్ష్మణ్, బత్తిని శ్రీనివాస్, వంశీధర్, కృష్ణారెడ్డి, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.