ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయి పోటీలు ఇటీవల ఢిల్లీలో నిర్వహించగా ఈ పోటీల్లో సిరిసిల్ల కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జక్కని హేమంత్ తన గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ రూపొందించిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిట్ పలువురి మన్ననలు పొందింది. ఈసందర్భంగా భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలను ప్రశంసిస్తూ సర్టిఫికెట్ అందజేసింది. ఈసర్టిఫికెట్ ను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ కి గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ పాఠశాలలో అందించారు.