బాలయ్య ఆకస్మిక మరణం
సాహితీ సమితికి తీరని లోటు
NEWS Sep 23,2024 07:05 pm
సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు, సహాయ కార్యదర్శి సబ్బని బాలయ్య ఆకస్మిక మరణం సాహితీ సమితికి తీరని లోటని అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగళ లక్ష్మణ్ లు అన్నారు. వారి కవిత్వం ముక్కుసూటిగా సరైన పదాలను వాడుతూ ముందుకు సాగే సున్నితమైన మనస్తత్వం కలిగిన కవి అని. మన మధ్య భౌతికంగా లేకపోవడం విచారకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు.