ఫోక్స్ యాక్ట్ గురించి అవగాహన
కల్పించిన షీ టీం ఎస్ఐ ప్రమీల
NEWS Sep 23,2024 07:03 pm
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ ప్రమీల మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా ద్వారా కానీ, నేరుగా కానీ ఎవరైనా విద్యార్థులతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినా, మాట్లాడినా, వారికి కఠినమైన శిక్ష ఉంటుందని తెలిపారు. ఇబ్బంది కలిగిస్తే 8712656425 నెంబర్ కి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ అధ్యాపకులు శ్రీనివాసరావు తెలిపారు.