ప్రజావాణి కార్యక్రమానికి 167 దరఖాస్తులు
NEWS Sep 23,2024 06:59 pm
రాజన్న సిరిసిల్ల: ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని పరిష్కారించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నిర్ణయం తీసుకునే దరఖాస్తులు ఉంటే వాటికి సంబంధించిన క్షేత్ర స్థాయి విచారణ త్వరితగతిన చేయాలని సూచించారు. ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.