స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి
NEWS Sep 23,2024 06:57 pm
పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లేని పక్షంలో ఈనెల 26న జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర వేలమంది విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, కోడం వెంకటేష్, పాల్గొన్నారు.