తిరుపతి లడ్డు దోషులను శిక్షించాలి: రమణ
NEWS Sep 23,2024 06:46 pm
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం జరిగిన కల్తీ ఘటనపై బీజేపీ సీనియర్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు,శ్రీ రామ సేన రాష్ట్ర నాయకులు యనమదల వెంకటరమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అపవిత్రం కావడానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మిగతా ఆలయాల్లోని ప్రసాదాలను కూడా తనిఖీ చేయాలన్నారు.