పారిశుద్ధంపై ఇంటింటి వెళ్తూ ప్రచారం
NEWS Sep 23,2024 06:32 pm
వేంపేట గ్రామంలో ఇంటింటి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛత పరిశుభ్రతపై మహిళలకు కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలని మహిళలను కోరారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పెట్టుకోవాలని కోరారు. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఎం అశోక్ గౌడ్ కరోబార్ భూమా చారి, ఆశా వర్కర్లు జి పద్మ, ఏం లక్ష్మి, బి దీప, ఆర్ సంజీవ తదితరులు పాల్గొన్నారు.