తెలంగాణలో భారీ వర్షం..
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
NEWS Sep 23,2024 06:33 pm
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, నిజమాబాద్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
మరో మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డిలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురిసే అవకాశం.