ఖాళీ కుర్చీతో సీఎంగా ఆతిశీ ఛార్జ్
NEWS Sep 23,2024 03:28 pm
ఢిల్లీ సీఎంగా ఆతిశీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు సీఎంగా పని చేస్తానని అన్నారు.