సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్-19జట్టును సంగారెడ్డిలోని జాబ్లీ క్లబ్ లో ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.