గతంలో ప్రధాని మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 25మంది వ్యాపారవేత్తల కోసం 16లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. జమ్ముకశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నరే రాజు అని రాహుల్ అన్నారు. మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను హరించిందని ధ్వజమెత్తారు.