27న ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Sep 23,2024 03:30 pm
హైదరాబాద్ లో 27న జరగపోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు మూల మల్లేశం గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర పుస్తకాన్ని, స్థానిక ఎమ్మార్వో ఆరిఫ్, ఎంపిడివో ప్రవీణ్ కుమార్ కు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, తెలంగాణా ఉద్యమకారుల సంక్షేమం కోసం, తమ మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన, ఇంటి స్థలాలతోపాటు, 25 వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేసారు