దేవర టికెట్ల ధరలు భారీగా పెంపు
NEWS Sep 23,2024 03:01 pm
ఎన్టీఆర్, - కొరటాల శివ మూవీ దేవర ఈనెల 27న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ వెసులుబాట్లు కల్పించారు. టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మిడ్ నైట్ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర 6 షోలకు, మిగతా రోజుల్లో 5 షోలకు అనుమతి ఇచ్చారు.