పర్యావరణాన్ని కాపాడడమే మన ప్రథమ విధి
NEWS Sep 23,2024 06:51 pm
పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ హరికృష్ణ, రీజనల్ అధికారి శ్రీనివాస్, దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు.