అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలి
NEWS Sep 23,2024 03:20 pm
కథలాపూర్: పోషణ, విద్యా సేవలు అందించే అంగన్వాడి కేంద్రం సేవలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ హైమది బేగం అన్నారు. కథలాపూర్ మండలం దుంపేటలోని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించిన పోషణ మహా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను గుర్తించి తీసుకోవాల్సిన ఆహారంపై వివరించారు. అంగన్వాడీ టీచర్లు సునీత, నాగమణి, ఆశావర్కర్ స్వప్న తదితరులు ఉన్నారు.