రైతు వ్యతిరేక విధానాలను వీడాలి
NEWS Sep 23,2024 03:06 pm
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని అందోల్ డివిజన్ సిఐటియు కార్యదర్శి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త బ్లాక్ డేలో భాగంగా జోగిపేటలో కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులకు భంగం కలిగించే కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు. రైతుల 4 లేబర్ కోడులను తక్షణమే రద్దు చేయాలి.