హైడ్రా కూల్చివేతలపై ఈటల సీరియస్
NEWS Sep 23,2024 02:00 pm
HYD: కూకట్‌పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు.