73,514 రైతులకు కొత్త రుణాలు: కలెక్టర్
NEWS Sep 23,2024 02:13 pm
రుణమాఫీ పొందిన వారిలో 73,514 రైతులకు కొత్త రుణాలు ఇచ్చామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మిగిలిన 24,731 మంది రైతులకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో లేడు బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, సహకార అధికారి కిరణ్ కుమార్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.