గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
NEWS Sep 23,2024 02:12 pm
హైదరాబాదులోని గాంధీ దావఖానాలో పరిస్థితిలను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిని పరిశీలించేందుకు లోపలికి వెళ్లాలని ప్రయత్నించారు. ఎమ్మెల్యేల అరెస్టుతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.