కొత్త మీడియాకు గుర్తింపుపై సమావేశం
NEWS Sep 23,2024 02:11 pm
హైదరాబాద్: ఆన్‌లైన్ మీడియా. యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు - అక్రిడిటేషన్ల జారీ అంశాలపై, తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హోటల్ టూరిజం ప్లాజాలో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.